Header Banner

మరో దారుణం.. ఐదేళ్ల బాలికపై పక్కింటి బాలుడి అత్యాచారం.. ప్రైవేటు భాగాల్లో 28 కుట్లు, ఒళ్లంతా..

  Fri Feb 28, 2025 10:02        India

మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో దారుణం జరిగింది. పొరుగింటి వ్యక్తి లైంగికదాడిలో ఐదేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. నిందితుడు అత్యంత పాశవికంగా ప్రవర్తించడంతో చిన్నారి ప్రైవేటు భాగాలపై 28 కుట్లు పడ్డాయి. శరీరం మొత్తం గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె గ్వాలియర్‌లోని కమలా రాజా ఆసుపత్రిలో ఐసీయూలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. శరీరం మొత్తం గాయాలు కావడంతో చిన్నారి విపరీతమైన నొప్పితో బాధపడుతోంది. నిద్ర కూడా పోవడం లేదు. ఆమె ప్రైవేటు భాగాలు, ముఖం, దవడలపై తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రి బెడ్‌పై పక్కకు కూడా ఆమె తిరగలేకపోతోంది. అంతగా ఆమె శరీరం గాయాలపాలైంది. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన 17 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

 

ఇది కూడా చదవండి: క్రిప్టో కరెన్సీ పేరుతో సుమారు 25 కోట్లకు టోకరా.. కట్ చేస్తే.. తమన్నా, కాజల్‌ను విచారించనున్న పోలీసులు!

 

ఈ నెల 22న రాత్రి నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. పొరుగునున్న ఝాన్సీ జిల్లాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలిక తండ్రిని చూసేందుకు చిన్నారి తాత, నానమ్మ ఆసుపత్రికి వెళ్లారు. దీనిని అవకాశంగా తీసుకున్న పక్కింటిలోని నిందితుడు బాలికను పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారని, కానీ, అతడిని బహిరంగంగా ఉరితీయాలని కోరుకుంటున్నట్టు బాలిక తాతయ్య చెప్పారు. బాలిక అపహరణకు గురైన సమయంలో ఇంటి ముందు ఆడుకుంటోంది. ఆమె తల్లి ఇంట్లో చిన్న కుమారుడితో ఉంది. బాలికను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వైద్య బృందం తెలిపింది. ఇప్పటి వరకు 28 కుట్లు వేసినట్టు పేర్కొంది. 

 

ఇది కూడా చదవండి: జీవీ రెడ్డి రాజీనామా వెనక ఉన్న అసలు కారణం ఇదే! ఎవరు నిజం? ఎవరు తప్పు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అసలు నిజాన్ని బయటపెట్టిన పోసాని.. ఆ పదవి కోసమే... వారు చెప్పినట్టే చేశాను! సుమారు 9 గంటలపాటు..

 

నేడు తొలిసారిగా పూర్తిస్థాయి బ‌డ్జెట్.. అనంత‌రం ఉద‌యం 10 గంట‌ల‌కు..

 

పిల్లల్నీ వదల్లేదు.. 299 మంది రోగులపై అత్యాచారం! వీడు మనిషి కాదు ఎంత క్రూరంగా..

 

భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన కెనడా.. వారికి వీసా రద్దు చేసే అవకాశం! ఈ కొత్త నిబంధనలతో..

 

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.? మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలు, మార్గదర్శకాలు ఇవే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #CrimeNews #MadhyaPradesh #Shivpuri